దీపికా ప‌దుకొణే చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్‌

Wed,December 19, 2018 10:16 AM
Deepika Padukone movie Gets An Interesting Title

బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణే న‌వంబ‌ర్‌లో ఇట‌లీ వేదిక‌గా ర‌ణ‌వీర్ సింగ్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బెంగ‌ళూర్‌, ముంబై వేదిక‌గా ప‌లు రిసెప్ష‌న్స్ జ‌రిగాయి. నూత‌న జంట హ‌నీమూన్‌కి ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికి ర‌ణ‌వీర్ ఒప్పుకున్న ప్రాజెక్టుల కార‌ణంగా ఇది వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తుంది. అయితే ప‌ద్మావ‌తి త‌ర్వాత దీపికా ప‌దుకొణే చేయ‌నున్న ప్రాజెక్ట్ ఏంట‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

పదమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జ‌రిగిన యాసిడ్ దాడిలో గాయ‌ప‌డ్డ లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాల‌ని బావించారు బాలీవుడ్ మేక‌ర్స్ . ఈ చిత్రంలో దీపికా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచిన ఆమె జీవితంకి సంబంధించిన చిత్రాన్ని మేఘ‌నా గుల్జార్ తెరకెక్కించ‌నున్నార‌ట‌. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో దీపికా ప‌దుకొణే న‌టించనుంది. సినిమాలో యాసిడ్ బాధితుల గురించి లార్జ్ స్కేల్‌లో చూపించాల‌ని ద‌ర్శ‌కులు భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నార‌ట‌. దీపికాకి జోడీగా రాజ్‌కుమార్ రావు పేరుని ప‌రిశీలిస్తున్నార‌ట‌.

మేఘ‌నా గుల్జార్ తెర‌కెక్కించ‌నున్న చిత్రానికి చ‌పాక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ముందుగా దీపిక‌కి జోడీగా రాజ్‌కుమార్ రావు పేరుని ప‌రిశీలించిన‌ప్ప‌టికి, ద‌ర్శ‌కులు విల‌క్ష‌ణ న‌టుడు విక్రాంత్ మాస్సే వైపు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

1183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles