దీపిక ఇంట మొద‌లైన ప్రీ వెడ్డింగ్ సంబురాలు

Fri,November 2, 2018 01:43 PM
Deepika Padukone gears up for  blessings

బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకొణే స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ని వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. నవంబర్ 14, 15 తేదీల్లో జ‌ర‌గ‌నున్న వీరి వివాహం ఇట‌లీలోని లేక్ కోమో వేదిక‌గా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, 200 మంది అతిధుల‌ని మాత్ర‌మే పెళ్లికి ఆహ్వానించ‌నున్నార‌ని అంటున్నారు. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, పార్టీ, డిసెంబర్ 11న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం. అయితే పెళ్ళికి ప‌ది రోజుల ముందే దీపిక ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకుల మొద‌లైన‌ట్టు తెలుస్తుంది. దీపిక స్టైలిస్ట్ ష‌లీనా న‌టానీ త‌న ఇన్‌స్టాగ్రాంలో ప్రీ వెడ్డింగ్‌కి సంబంధించిన కొన్ని ఫోటోల‌ని షేర్ చేసింది. ఇందులో దీపిక త‌న కుటుంబ సభ్యుల‌తో క‌లిసి సర‌దా స‌మ‌యాన్ని గడుపుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. పెళ్లి తర్వాత వారు కలిసి ఉండబోయే ఇంటిని కూడా ఇప్పటికే ఫైనలైజ్ చేసుకున్నార‌ట దీప్‌-వీర్ జంట‌ . ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్‌వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.ర‌ణ్‌వీర్ ప్ర‌స్తుతం సింబా, గల్లీ బాయ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, త్వ‌ర‌లో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది దీపిక .

2091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles