ముంబై చేరుకున్న నూత‌న దంప‌తులు

Sun,November 18, 2018 12:04 PM
Deepika Padukone and Ranveer Singh rached to Mumbai

ఇటలీలోని లేక్‌కోమో వేదికగా దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ల వివాహం రెండు రోజుల పాటు జ‌రిగిన విష‌యం విదిత‌మే. న‌వంబ‌ర్ 14న కొంక‌ణి వివాహ ప‌ద్ద‌తిలో వీరి పెళ్లి వేడుక జ‌రుగ‌గా, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. త‌మ పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కి రాకుండా చాలా సీక్రెట్‌గా వీరి వివాహం జ‌రిగింది. ఈ రోజు ఉద‌యం దీప్‌ వీర్ దంప‌తులు ముంబై చేరుకోగా ఎయిర్ పోర్ట్‌లో నూత‌న దంప‌తుల‌కి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ర‌ణ్‌వీర్ ఇంటి వ‌ద్ద కూడా అభిమానులు గుమికూడ‌గా వారికి దీప్‌వీర్‌లు అభివంద‌నం చేశారు. నూత‌న దంప‌తులు ఇద్ద‌రు గోల్డ్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెర‌వ‌డం విశేషం. ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు ఎవ‌రి ప్రాజెక్టుల‌తో వారు బిజీ కానున్నారు.


1635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles