తెల్ల‌టి దుస్తుల‌లో మెరిసిన దీప్‌వీర్ జంట‌

Sun,November 11, 2018 08:42 AM
Deepika Padukone and Ranveer Singh moves to italy

ఆరేళ్ళుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న దీపికా, రణ్‌వీర్‌లు నవంబర్ 14, 15 తేదీల్లో జ‌ర‌గ‌నున్న వివాహంతో ఒక్క‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. ఇట‌లీలోని లేక్ కోమో వేదిక‌గా వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తైన‌ట్టు తెలుస్తుంది. ఈ నెల 14న కొంకణీ సంప్రదాయంలో, 15న సింధీ సంప్రదాయంలో రణ్‌వీర్‌-దీపిక పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. నవంబర్ 13న సంగీత్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 21న బెంగ‌ళూరులో, డిసెంబర్ 11న ముంబైలోని హయత్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని టాక్. అయితే ఈ ప్రేమ ప‌క్షులు శ‌నివారం ఉద‌యం ముంబై నుండి ఇట‌లీకి బ‌య‌లు దేరి వెళ్ళారు. వీరిని చూసిన అభిమానులు గోల చేశారు. తెల్ల‌టి దుస్తుల‌లో మెరిసిన ఈ ప్రేమ జంట‌కి సంబంధించిన‌ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. పెళ్లికి 200 మంది మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. వివాహ‌మైన మూడు రోజుల త‌ర్వాత నూత‌న దంప‌తులు ఇండియాకి వ‌స్తార‌ని అంటున్నారు. ర‌ణ్‌వీర్ ప్ర‌స్తుతం సింబా, గల్లీ బాయ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది దీపిక .

View this post on Instagram

👍👍👍 #deepikapadukone

A post shared by Viral Bhayani (@viralbhayani) on

View this post on Instagram

Hand in Hand, Beautiful Couple #deepikapadukone #ranveersingh as they leave for their wedding abroad 💍👰🏻🤵🏻 #bollywood #DeepVeer #RanveerDeepikaWedding #RanveerWedsDeepika #DeepikaWedsRanveer #DeepveerKiShaadi #RanveerDeepika . Love to see them both together.. waiting for their marriage pics LotZzz of love to both❤️😘 . تم رصد المعاريس في المطار 💍👰🏻🤵🏻 #بوليوود #ديبيكا_بادكون #رانفير_سينغ #عرس_ديبي_و_رانفير #عرس_ديبفير . . اوف تحمسسسسست يا جماعه بس الظاهر عرسها بيصير نفس انوشكا ماواح نشوف صور وفيديوات بنهار 😭💔 اوف كان بخاطري يكون نفس عرس سونام يالليل 😭😭♥️

A post shared by sara khan 🕊🇰🇼 (@sarah.bollywood) on

1758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles