రిసెప్ష‌న్‌లో క‌నువిందు చేసిన కొత్త జోడి

Thu,November 22, 2018 08:20 AM
Deepika Padukone and Ranveer Singh grand wedding reception

బాలీవుడ్ న్యూ క‌పుల్ దీపిక ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్‌ల రిసెప్ష‌న్ నిన్న సాయంత్రం బెంగ‌ళూర్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మానికి కుటుంబ స‌భ్యులు, స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. రాయ‌ల్టీ లుక్‌లో మెరిసిన కొత్త దంప‌తులుకి కుటుంబ స‌భ్యులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. పీవీ సింధు, అనీల్ కుంబ్లే, గోపిచంద్ త‌దిత‌ర ప్ర‌ముఖులు కూడా ఈ రిసెప్షన్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఈ వేడుక‌లో దీపిక గోల్డ్ క‌ల‌ర్ చీరని ధ‌రించగా, ర‌ణ్‌వీర్ బ్లాక్ క‌ల‌ర్ కుర్తా ధ‌రించాడు. తాజాగా వీరి రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కి రాగా, వాటిని చూసి అభిమానులు మురిసి పోతున్నారు. దీప్‌వీర్‌ల వివాహం ఇట‌లీలోని లేక్ కోమ్ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలని ఇటీవ‌ల దీపికా, ర‌ణ్‌వీర్‌లు రిలీజ్ చేసి అభిమానుల‌లో ఆనందం నింపారు. నవంబ‌ర్ 28న ముంబైలో మ‌రో వివాహా విందు ఏర్పాటు చేయ‌గా, దీనికి బాలీవుడ్ తారాగ‌ణం మొత్తం క‌దిలి రానుంది.

1427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles