ఇట‌లీలో వివాహం.. ముంబైలో రిసెప్ష‌న్..!

Sat,July 28, 2018 11:24 AM
deepika marriage at italy

ఇటీవలి కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీలు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డుతున్నారో, ఎప్పుడు వివాహం చేసుకుంటున్నారో అస్స‌లు ఎవ్వ‌రికి అర్ధం కావ‌డం లేదు. మీడియా ప్ర‌తినిధులు పెళ్లి గురించి ప్ర‌శ్నించిన మాట దాటేసి అలాంటిదేమి లేద‌ని చెబుతూనే కొన్నాళ్ళ‌కి పెళ్లి పీట‌లెక్కుతున్నారు. అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్‌లు ఇలాగే త‌మ‌కి న‌చ్చిన వారిని ప్రేమ వివాహం చేసుకోగా, ప్రియాంక చోప్రా అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌తో త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నుంది. ఇక దీపిక‌-ర‌ణ్‌వీర్‌ల వివాహంపై కొన్నాళ్ళ‌నుండి ప‌లు వార్త‌లు వినిపిస్తున్నా, వాటిపై క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా వీరి పెళ్లికి వివాహ వేదిక ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లికి సంబంధించిన షాపింగ్ ఇప్ప‌టికే పూర్తైంద‌ని తెలుస్తుండ‌గా, న‌వంబ‌ర్ 10న ఉత్త‌ర ఇట‌లీలోని లంబార్టీ అనే ప్ర‌దేశంలో అబ్బుర‌ప‌ర‌చే ప్ర‌కృతి అందాల మ‌ధ్య వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. స‌ర‌స్సు చుట్టూ ఉన్న వ‌స‌తులు, లాడ్జిలు, విల్లాలు ఇప్ప‌టికే బుక్ చేసారని అంటున్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనున్న ఈ జంట ముంబైలో రిసెప్ష‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. త్వ‌ర‌లో నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తంతు కూడా ముగించేయ‌నున్నారని అంటున్నారు. పెళ్లి తర్వాత తాము కలిసి ఉండబోయే ఇంటిని కూడా వీళ్లు ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్‌వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.

కొన్నాళ్ళుగా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న దీపికా ప్ర‌స్తుతం కోలుకుంది. ప‌ద్మావ‌తి చిత్రం త‌రువాత నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయాల‌నుకుంది దీపిక‌.కాని ఈ మూవీని పెళ్లి త‌ర్వాత‌నే చేయ‌నుంద‌ని అంటున్నారు. ఇక ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌స్తుతం గ‌ల్లీ బాయ్ తో పాటు టెంప‌ర్ రీమేక్ సింబా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని న‌వంబ‌ర్ లోపు పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి దీపికా-ర‌ణ్‌వీర్‌ల పెళ్లిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

3667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS