ఫిల్మ్ ఫేర్ వేడుక‌ల‌కి అంతా సిద్దం.. 17 నామినేష‌న్స్‌తో టాప్‌లో ప‌ద్మావ‌త్

Sat,March 23, 2019 01:28 PM

బాలీవుడ్‌లో ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా జ‌రిగే ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుక‌లని ఈ ఏడాది కూడా అంతే ఘ‌నంగా జ‌రిపేందుకు నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేశారు. నేటి రాత్రి ముంబైలోని జియో గార్డెన్‌లో ఈ వేడుక జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్‌కి చెందిన సెల‌బ్రిటీలు అంద‌రు పెద్ద ఎత్తున హాజ‌రై ఆ ప్రాంగ‌ణాన్ని కోలాహాలంగా మార్చ‌నున్నారు. ఈ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుక‌లో 2018లో విడుద‌లైన బెస్ట్‌ చిత్రాల‌కి గాను అవార్డుల‌ని అందించ‌నుండ‌గా, ఈ సారి రేసులో ప‌ద్మావ‌త్, ప్యాడ్‌మాన్‌, సంజు, స్త్రీ, రాజీ, అంద‌ధున్ చిత్రాలు ఉన్నాయి. ఇప్ప‌టికే బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ స్టోరీ, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డిరెక్ట‌ర్ ఇలా త‌దిత‌ర విభాగాల‌కి చెందిన నామినేష‌న్స్ ప్ర‌క‌టించ‌గా ఎవ‌రికి ఈ అవార్డ్ ద‌క్కించుకుంటార‌నే దానిపై అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ పీరియాడిక‌ల్ చిత్రం ప‌ద్మావ‌త్ 17 నామినేష‌న్స్‌తో టాప్‌లో ఉండ‌గా, ఆ తర్వాతి స్థానంలో మేఘ‌న గుల్జార్ రాజీ( 15 నామినేష‌న్స్) నిలిచింది. ఇక అంద‌ధున్ 11, బ‌దాయి హో చిత్రం 11 నామినేష‌న్స్‌తో మూడో స్థానంలో నిలిచాయి.

1394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles