మా పెళ్లి ఆ రోజే.. కన్ఫామ్ చేసిన బాలీవుడ్ జంట

Sun,October 21, 2018 04:53 PM
Deepika and Ranveer reveals their Wedding date in Twitter

నెలల తరబడి సస్పెన్స్‌కు తెరదించింది బాలీవుడ్ జంట దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్. తమ పెళ్లి తేదీని ట్విటర్ వేదికగా ప్రకటించేసింది. ఇద్దరూ నాలుగు నిమిషాల వ్యవధిలో తమ పెళ్లి తేదీలను ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో తమ పెళ్లి జరగనున్నట్లు దీపికా, రణ్‌వీర్ సింగ్ వెల్లడించారు. ఇద్దరి కుటుంబాల ఆశీస్సులతో తమ పెళ్లి తేదీ ప్రకటిస్తున్నట్లు వీళ్లు చెప్పారు. కొన్నేళ్లుగా వీళ్లద్దరూ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. న‌వంబ‌ర్‌లోనే వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని, దీనికోసం దీపికా షాపింగ్ కూడా చేస్తున్న‌ద‌ని గ‌తంలో ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే పెళ్లి త‌ర్వాత ఉండాల్సిన ఇంటిని కూడా త‌మ అభిరుచికి త‌గిన‌ట్లు వీళ్లు మ‌ల‌చుకున్నారు. అయినా వీళ్లు మాత్రం ఎప్పుడూ త‌మ పెళ్లి విష‌యంలో బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దీపికా తన రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయింది. ఈ ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ మూవీల్లో ఈ జంట చూడముచ్చటగా ఉంది. ఇక పద్మావత్‌లోనూ ఈ ఇద్దరూ కనిపించినా.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. రణ్‌వీర్ ఖిల్జీగా, దీపికా రాణి పద్మిణిగా నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య సినిమాలో రొమాంటిక్ సీన్లు ఉన్నాయన్న వార్తలతో మూవీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరిగాయి.
3294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles