దీపికా, రణ్‌వీర్ నాపై దాడి చేశారు!

Fri,August 3, 2018 04:55 PM
Deepika and Ranveer attacked me says a fan who shoots a video of couple in Florida

బాలీవుడ్ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ వెకేషన్‌కు వెళ్లారు..ఎయిర్‌పోర్ట్‌లో ముద్దు పెట్టుకున్నారులాంటి వార్తలు అభిమానులందరికీ తెలిసిందే. అయితే వాళ్లకు తెలియని మరో సంచలన విషయాన్ని ఓ అభిమాని బయటపెట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఈ ప్రేమ పక్షులు.. రోడ్డుపై చేతిలో చేయి వేసి వెళ్తున్న వీడియో ఒకటి మధ్య వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ అభిమాని తీసింది. అయితే ఈ వీడియో తీసినందుకు ఈ సెలబ్రిటీ కపుల్ తనపై దాడి చేసినట్లు ఆమె చెప్పింది. జైనాబ్ ఖాన్ అనే ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. వాళ్లు నాపై దాడి చేశారు. వాళ్లు తమ అభిమానిని, తమ ఆత్మగౌరవాన్ని కోల్పోయారు. ఇలాంటి అమర్యాదస్తులైన నటులని నేను అనుకోలేదు అని జైనాబ్ పోస్ట్ చేసింది.

అయితే వాళ్లు దాడి చేసిన వీడియో మీ దగ్గర ఉందా అని ఓ అభిమాని ప్రశ్నించగా.. వాళ్ల మొహాలు ఓసారి చూడండి.. వాళ్లు నన్ను హింసించారు. వీడియో కొనసాగించే సమయం నాకు దక్కలేదు అని జైనాబ్ చెప్పింది. అయితే చాలా మంది అభిమానులు రణ్‌వీర్, దీపికాలనే వెనకేసుకొచ్చారు. వాళ్లకూ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి.. వాళ్లనలా వదిలేయండి అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. మరి వాళ్ల అనుమతి లేకుండా ఎందుకు వీడియో తీశావు అని మరో అభిమాని ప్రశ్నించాడు. దీంతో అప్పుడు జరిగిన ఘటనను మొత్తం జైనాబ్ ఖాన్ వివరించింది. తానేమీ వాళ్ల వెంట పడలేదని, తాను కూడా వెకేషన్‌కు వెళ్లినపుడు కనిపిస్తే వీడియో తీశానని, ఎవరైనా అదే చేస్తారని ఆమె చెప్పింది. అంతేకాదు తనపై వాళ్లు ఎలా దాడి చేశారన్న విషయాన్ని కూడా వివరించింది. దీపికా నావైపు నవ్వుతూ వస్తుంటే ఫొటో తీసుకోవాడనికి అనుమతి ఇస్తారని అనుక్ను. కానీ వాళ్లిద్దరూ నాపై అరిచారు అని ఆమె తెలిపింది. వాళ్లపై తనకున్న గౌరవం పోయిందని ఆమె స్పష్టంచేసింది.

2781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles