వైజాగ్‌లో డియ‌ర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Tue,July 23, 2019 08:46 AM
Dear Comrade Pre Release Event on 24th in Vizag

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో భ‌రత్ క‌మ్మ తెర‌కెక్కించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్. ఈ చిత్రం జూలై 26న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. సోషల్ మెసేజ్ తో పాటు యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంకి సంబంధించి మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. ఇటీవ‌ల జ‌ర‌గిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ని ఈ నెల 24న రాత్రి 7 గంటలకు విశాఖ జిల్లా సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో శృతి రామచంద్రన్ కీల‌క పాత్ర పోషించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన సాంగ్స్, టీజ‌ర్స్‌, ట్రైల‌ర్ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. డియ‌ర్ కామ్రేడ్ చిత్రం మ‌రో మంచి చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని అలరించ‌నుంద‌ని అంటున్నారు.

703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles