డియర్ కామ్రేడ్ విడుదల తేదీ ఫిక్స్

Wed,May 8, 2019 10:29 PM


విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్' ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్మాత‌లు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles