‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే’..డియర్ కామ్రేడ్ లిరికల్ సాంగ్

Mon,April 8, 2019 03:31 PM
Dear Comrade First Song Nee Neeli Kannullona revealed


గీతగోవిందం తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా మొదటి పాటను విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్..డియర్ కామ్రేడ్ నుంచి తొలిపాటను ఇవాళ విడుదల చేసింది. ‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..తెల్లారి అల్లేసింది నన్నే..నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి..నీ వైపే లాగేస్తుంది నన్నే’ అంటూ సాగే ఈ పాట అద్భుతమైన లిరిక్స్‌తో అందరినీ అలరిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఈ పాటను గౌతమ్ భరద్వాజ్ ఆలపించాడు. ఈ పాట రాబోయే రోజుల్లో మిలియన్ల సంఖ్యలో హిట్స్ సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డియర్ కామ్రేడ్ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles