ఆస్తుల్లో వాటా ఇవ్వాలంటూ 'దాసరి' కోడలు నిరసన

Tue,September 11, 2018 06:38 AM
dasari prabhu wife Susheela demands  share in  property

బంజారాహిల్స్: దివంగత కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కోడలు దాసరి సుశీల ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.46లోని దాసరి నివాసం వద్ద బైఠాయించారు. దాసరి నారాయణరావు పెద్దకుమారుడు ప్రభుతో 1995లో ప్రేమ వివాహం జరిగిందని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేసుకున్నామని వెల్లడించింది.

ఆమెకు పలు మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి. దాసరి నారాయణరావు ఉన్నంతకాలం తమ కుటుంబానికి అండగా నిలిచారని, ఆయన మరణానంతరం కొడుకు తమను విస్మరించడంతోపాటు కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించక‌పోవడంతో రోడ్డున పడ్డామని ఆరోపించారు. ఇప్పటికీ చట్టపరంగా దాసరి ప్రభుతో విడాకులు ఇవ్వలేదని, మామ ఆస్తిపై హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు ఇంటి నుంచి వెళ్లనని భీష్మించుక కూర్చుకున్నారు.

9461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles