పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రజ‌నీకాంత్ ‘దర్బార్‌’

Wed,April 10, 2019 12:13 PM
DARBAR Shoot begins today with a formal POOJA  at Mumbai

సూపర్ స్టార్ రజ‌నీకాంత్- స్టార్ డైరెక్ట‌ర్ మురుగదాస్ కాంబినేషన్ లో ‘దర్బార్‌’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. ఈ రోజు చిత్ర పూజా కార్యక్రమాలను పూర్తి చేసి మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళారు మేకర్స్. రెండు నెల‌లో చిత్రాన్ని పూర్తి చేయాల‌ని మురుగ‌దాస్ భావిస్తున్నాడ‌ట‌. న‌య‌న‌తార చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ‌రోసారి ర‌జ‌నీకాంత్ చిత్రానికి స్వ‌రాలు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. ఇందులో ర‌జ‌నీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం.


1053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles