హాలీవుడ్ సినిమా పోస్ట‌ర్‌ని పోలి ఉన్న ద‌ర్భార్ ఫ‌స్ట్ లుక్

Sat,April 13, 2019 08:51 AM
Darbar first look copy to hollywood film

నేటి యువ‌త సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న నేప‌థ్యంలో ప్ర‌పంచంలో జ‌రుగుతున్న ప్ర‌తి విష‌యంపై వారికి ఓ అవ‌గాహ‌న వ‌స్తుంది. ముఖ్యంగా సినిమాల విష‌యానికి వ‌స్తే సౌత్ లేదా నార్త్‌లలో రిలీజ్ అవుతున్న సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ లేదా టీజ‌ర్ అయిందంటే చాలు, అది వెంట‌నే హాలీవుడ్ సినిమాకి కాపీ అని ప్రూఫ్‌ల‌తో చెప్పేస్తున్నారు. తాజాగా మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ద‌ర్భార్ చిత్రం ఫ‌స్ట్ లుక్ హాలీవుడ్ మూవీ పోస్ట‌ర్ కాపీ అంటూ ట్విట్ట‌ర్‌లో ర‌చ్చ చేస్తున్నారు.

మురుగ‌దాస్ తెర‌కెక్కించిన గ‌త చిత్రాలు తుపాకి, కత్తి సినిమాల విషయంలో నెటిజ‌న్స్ ఈ రెండు హాలీవుడ్‌కి కాపీ అని అప్ప‌ట్లో స‌ర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా ద‌ర్భార్ చిత్రం ఫ‌స్ట్ లుక్‌ని హాలీవుడ్‌లో 2017లో వచ్చిన కిల్లింగ్ గంథర్ సినిమా పోస్టర్ నుంచి తీసుకున్నారని అంటున్నారు. ఆర్నాల్డ్ ష్వాట్జ్‌నెగ్గర్ ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. మురుగ‌దాస్ క్యాపీ క్యాట్‌గా మారాడ‌ని, పోస్టర్ల‌తో పాటు స్టోరీని కూడా ఆయ‌న కాపీ కొడుతున్నాడ‌ని నెటిజ‌న్స్ సెటైర్స్ వేస్తున్నారు.

ఇటీవ‌ల ముంబైలో ఘ‌నంగా ప్రారంభ‌మైన ద‌ర్భార్ చిత్రం ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ స్వ‌రాలు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. ఇందులో ర‌జ‌నీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

1104
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles