మ‌ళ్లీ అత‌నే జేమ్స్‌బాండ్‌

Wed,August 16, 2017 03:15 PM
Daniel Craig says he is coming back as James Bond.

లండ‌న్: సీక్రెట్ ఏజెంట్ జేమ్స్‌బాండ్ రోల్ ఎవ‌రు ప్లే చేస్తార‌న్న‌ది తేలిపోయింది. జేమ్స్‌బాండ్‌గా మ‌ళ్లీ తానే వ‌స్తున్న‌ట్లు డానియ‌ల్ క్రేగ్ చెప్పేశాడు. గ‌తంలో నాలుగుసార్లు జేమ్స్‌బాండ్ పాత్ర పోషించిన క్రేగ్ ఈ విష‌యాన్ని అమెరికా టీవీ షోలో స్ప‌ష్టం చేశాడు. 25వ బాండ్ మూవీ 2019 న‌వంబ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ది. అయితే దీనికి సంబంధించి ఇటీవ‌ల చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు డానియ‌ల్ తెలిపాడు. బాండ్ రోల్ చేయాల‌ని ఉన్న‌ది, నాకో బ్రేక్ కావాల‌ని క్రేగ్ టీవీ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అయితే స్పైగా అదే చివ‌రి మూవీ అవుతుంద‌ని అత‌ను వెల్ల‌డించాడు. పియ‌ర్స్ బ్రాస్న‌న్ త‌ర్వాత క్రేగ్ బాండ్ పాత్ర పోషిస్తున్నాడు. కాసినో రాయ‌ల్‌, క్వాంట‌మ్ ఆఫ్ సొలేస్‌, స్కైఫాల్‌, స్పెక్ట‌ర్ చిత్రాల్లో డానియ‌ల్ న‌టించాడు.

1200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles