నో టైమ్ టు డై.. టీజ‌ర్ అదిరింది.. ట్రైల‌ర్ ఎల్లుండే

Mon,December 2, 2019 03:29 PM

హైద‌రాబాద్‌: డేనియ‌ల్ క్రేగ్ న‌టిస్తున్న జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డై ట్రైల‌ర్ బుధ‌వారం రిలీజ్‌కానున్న‌ది. ఇటీవ‌ల రిలీజైన 15 సెక‌న్ల టీజ‌ర్‌లో అన్ని యాక్ష‌న్ సీన్లు ఆక‌ట్టుకుంటున్నాయి. బ్లా షూట్‌, స‌న్‌గ్లాసెస్‌లో క్రేగ్ స్ట‌యిలిష్‌గా క‌న‌బ‌డుతున్నాడు. ఇక కార్లు, బైక్‌ల‌తో స్టంట్లు మ‌రింత అద‌ర‌గొడుతున్నాయి. కారు హెడ్‌లైట్ నుంచి గ‌న్ బ్యారెల్స్ బ‌య‌ట‌కు రావ‌డం.. బాండ్ మూవీని కొత్త స్థాయికి తీసుకువెళ్తున్న‌ది. రామీ మాలిక్ ఈ సినిమాలో విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. బుధ‌వారం రిలీయ్యే ట్రైల‌ర్ కోసం బాండ్ ప్రేక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.



1159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles