దంగల్ రికార్డుల ప్రభంజనం ఇంకా ఆగలేదు

Sun,September 24, 2017 08:38 AM
దంగల్ రికార్డుల ప్రభంజనం ఇంకా ఆగలేదు

రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం దంగల్. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో తండ్రి పాత్రని పోషించగా ఈయన కూతుళ్ళుగా గీతా ఫోగట్, బబిత కుమారిలు నటించారు. ఇటీవల ఈ చిత్రం చైనాలో విడుదలై వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించిన తొలి విదేశీ చిత్రంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక హాంకాంగ్‌లోను ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. 23.45 హాంకాంగ్ మిలియన్ డాలర్స్ ( దాదాపు 19.56 కోట్ల) వసూళ్ళు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. హాంకాంగ్, మచ్చులో దంగల్ చిత్రం 46 థియేటర్స్‌లో విడుదల కాగా, గతంలో అమీర్ ఖాన్ సినిమాలు సాధించిన వసూళ్ళని ఇది బ్రేక్ చేసింది. దంగల్ చిత్రం విదేశాలలో 217.17 మిలియన్ డాలర్స్ వసూళ్ళు రాబట్టగా, భారత్‌తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 297.68 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది.

1267

More News

VIRAL NEWS