సల్మాన్‌ను కలిసిన 'డ్యాన్సింగ్ అంకుల్' ఫ్యామిలీ.. ఫోటోలు

Sat,June 9, 2018 03:07 PM
Dancing Uncle met Salman Khan in Das ka dum set

ఇది ఓవర్‌నైట్ స్టార్ల కాలం. స్మార్ట్ ఫోన్ల కాలం. ఏంటో ఈ కలికాలం. రీసెంట్‌గా మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు గుర్తుందా? ఆయన పేరు ఏదో ఉందే.. గుర్తు రావట్లేదు. ఆ.. గుర్తొచ్చింది.. సంజీవ్ శ్రీవాత్సవ. అసలు ఆయన పేరును ఎవ్వరూ గుర్తు పెట్టుకోర‌ట‌. ఆయనను అంతా డ్యాన్సింగ్ అంకుల్ లేదంటే 'ద‌బ్బు ది డ్యాన్సర్' అనే పిలుస్తారట. అలా పిలిస్తేనే ఆయనకు ఇష్టం అట. సరే.. అవన్నీ పక్కన బెడితే.. డ్యాన్సింగ్ అంకుల్ రీసెంట్‌గా తన ఫ్యామిలీతో సహా సల్మాన్ భాయ్‌ని కలిశాడు.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'దస్ కా దమ్3' అనే టీవీ షో షూటింగ్‌లో ఉండగా.. షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి సల్లూ భాయ్‌ని కలుసుకున్నట్లు డ్యాన్సింగ్ అంకుల్ ట్వీట్ చేశాడు. తన ఫ్యామిలీ సల్మాన్‌తో దిగిన ఫోటోలను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆయన వెరైటీ స్టెప్పులతో కూడిన డ్యాన్స్ వీడియో ఎలా వైరలయిందో.. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అన్నట్టు.. ఆయన గోవింద తరహాలో డ్యాన్స్ చేసిన వీడియోను మీరు చూశారా? ఒకవేళ చూడకపోతే మీకోసం మళ్లీ ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి.

2709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles