హౌజ్‌లో స్టెప్పుల‌తో దుమ్మురేపిన ఇంటి స‌భ్యులు

Wed,September 5, 2018 09:06 AM
Dance Baby Dance in bigg boss house

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 87లో ఇంటి స‌భ్యులు కృష్ణాన‌గ‌ర్‌ని గుర్తు తెచ్చుకున్నారు. సినిమా వాళ్ళ‌కి అదొక స్వ‌ర్గం లాంటిద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక ఆ త‌ర్వాత బెడ్ పై కూర్చొని ఇంటి స‌భ్యులు మాట్లాడుకుంటుండ‌గా, కౌశ‌ల్ చిన్న కునుకు తీసాడు. దీంతో కుక్క‌లు అరిసాయి. తాను నిద్ర పోవ‌డం లేద‌ని జ‌స్ట్ అలా కూర్చొని కాలు ఊపుతున్నానంటూ కౌశ‌ల్ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా, దొరికిపోయావంటూ మిగ‌తా ఇంటి స‌భ్యులు హేళ‌న చేశారు. ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చారు. టాలీవుడ్ మార‌థాన్ అనే టాస్క్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యులు అంద‌రు సినిమా లుక్ కి సంబంధించి కాస్ట్యూమ్స్ ధ‌రించి సాంగ్ ప్లే కాగానే డాన్స్ ఫ్లోర్‌పై డ్యాన్స్ చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. విడ‌త‌లుగా సాంగ్ ప్లే అవుతుంది. ఆ స‌మ‌యంలో వెళ్ళి డాన్స్ ఫ్లోర్ పై చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు .

టాలీవుడ్ మార‌థాన్ టాస్క్‌లో గీతా మాధురికి జిగేల్ రాణి అనే పాట ఇవ్వ‌గా, దీప్తికి అ అంటే అమ‌లాపురం, శ్యామ‌ల‌కి జంక్ష‌న్ లో .., కౌశ‌ల్‌కి తోబా తోబా, సామ్రాట్ కి సీటీ మార్‌, రోల్‌కి నాయ‌రే నాయ‌రే , అమిత్‌కి ట్రింగ్ ట్రింగ్‌, త‌నీష్‌కి రారా డూ డూ అనే ఇండివిడ్యుయ‌ల్ సాంగ్స్ ఇచ్చారు. ఇక గ్రూప్ సాంగ్స్ కి వ‌స్తే అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడు , బాయ్స్ గ్యాంగ్‌కి అద‌ర‌గొట్టు గొట్టు గొట్టు.. సాంగ్ , గార్ల్స్ సాంగ్ కెవ్వు కేక.. సాంగ్స్ ఇచ్చారు బిగ్ బాస్ . ఎవ‌రైన‌ సాంగ్ చేయ‌డం మ‌ర‌చిపోతే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ రాద‌ని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ఇంటి స‌భ్యులు అంద‌రు త‌మ‌కి ఇచ్చిన కాస్ట్యూమ్స్ తో స్టేజ్‌పై దుమ్ము రేపేందుకు సిద్ధ‌మ‌య్యారు.

సాంగ్‌ ప్లే అవ‌గానే ఆ సాంగ్‌కి సంబంధించిన ఇంటి స‌భ్యుడు డ్యాన్స్ ఫ్లోర్‌పై స్టెప్స్ తో అద‌రగొట్టారు. ముందుగా సోలోగా స్టెప్పులు వేసిన ఇంటి స‌భ్యులు మ‌ధ్య‌లో అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడు పాట‌కి గ్రూప్ డ్యాన్స్ చేశారు. దీప్తికి ఇచ్చిన‌ పాట‌ని మూడు విడ‌త‌లుగా ప్లే చేయ‌డంతో ఆమె మూడు సార్లు వెంటనే వెంట‌నే డ్యాన్స్ చేసింది. దీంతో కొంత నీర‌సించిన‌ట్టు క‌నిపించింది. ఇక ఆ త‌ర్వాత బిగ్ బాస్ రిపీటెడ్‌గా సాంగ్స్ ప్లే చేశారు. దీంతో సోల్ సాంగ్స్ , గ్రూప్ సాంగ్, బాయ్స్ సాంగ్స్ , గార్ల్స్ సాంగ్స్‌కి అదిరిపోయే స్టెప్పులు వేసి బిగ్ బాస్ హౌజ్‌ని హోరెత్తించారు. మొత్తానికి ఎపిసోడ్ 87 మొత్తం ఇలా ఆటపాటలతోనే సాగింది. ఇంటి స‌భ్యులు కూడా ఈ టాస్క్ బాగా ఎంజాయ్ చేశారు. బుధవారం ఎపిసోడ్‌లో కూడా ఈ టాస్క్‌ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

4385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles