నిర్మాత‌కి చ‌ర‌ణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా ?

Fri,June 15, 2018 10:22 AM
danayya recieved sweet mangoes from ram charan

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 12వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ని బ్యాంకాక్‌లో తెర‌కెక్కించాడు బోయపాటి. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రగ‌నుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నిన్న చ‌ర‌ణ్ మ్యారేజ్ డే కావడంతో త‌న మూవీ నిర్మాత‌కి మామిడి పండ్ల బుట్ట‌ని గిఫ్ట్‌గా పంపాడు. ఈ క్ర‌మంలో దాన‌య్య త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విష‌యాన్ని తెలిపాడు. స్వీటెస్ట్ క‌పుల్ నుండి స్వీట్ మామిడి పండ్లు అందుకున్నాను అంటూ త‌న పోస్ట్‌కి క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. దాన‌య్య .. చ‌ర‌ణ్ సినిమాతో పాటు త్వ‌ర‌లో రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ నిర్మించ‌నున్నాడు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్, ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుండ‌గా, ఈ చిత్రానికి రాజ‌వంశ‌స్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌.


3332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles