స‌మంత చిత్ర వేడుక‌కి గెస్ట్‌లుగా ద‌గ్గుబాటి హీరోలు

Sat,June 29, 2019 09:58 AM
daggubati heroes guests for OhBaby Pre Release Event

అక్కినేని కోడ‌లు స‌మంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో న‌టించిన చిత్రం ‘ఓ బేబి’ . సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెర‌కెక్కించారు. ఓ సెలూన్ కు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఓ పెద్దావిడా.. పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. అదెలా సాధ్య‌మైంది అనేది చిత్ర‌ అస‌లు క‌థ‌. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 5న చిత్రం రిలీజ్ కానుంది. ఈ రోజు సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జెఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌, హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కి ముఖ్య అతిధులుగా ద‌గ్గుబాటి వెంక‌టేష్‌, ద‌గ్గుబాటి రానా హాజ‌రు కానున్నారు. ఈ ఇద్ద‌రు హీరోల ఎంట్రీతో వేడుక సంద‌డిగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తుంది .

ఓ బేబి చిత్రంలో స‌మంత వృద్ధురాల‌య్యాక ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపిస్తారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.

1466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles