ఒకే ఫ్రేములో ద‌గ్గుబాటి ఫ్యామిలీ.. వైర‌ల్‌గా మారిన ఫోటో

Tue,March 26, 2019 08:47 AM
daggubati family in single frame

విక్ట‌రీ వెంక‌టేష్ కూతురు ఆశ్రిత వివాహం ఆదివారం తెల్ల‌వారు జామున జైపూర్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం జ‌ర‌గ‌గా, వీరి వివాహ వేడుక‌కి టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. ఎంతో గోప్యంగా ఈ వెడ్డింగ్‌ని జ‌రిపించ‌గా, పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా బ‌య‌ట‌కి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. అయితే తాజాగా ద‌గ్గుబాటి ఫ్యామిలీ అంతా వివాహ వేడుక‌లో క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. వెంక‌టేష్‌, రానా, చైతూ, సురేష్ బాబు ఇలా ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారంతా ఒకే ఫ్రేములో ఉన్నారు. ఈ పిక్‌ని చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్‌ని వెంకీ ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం వెంకీ, చైతూ క‌లిసి వెంకీ మామ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం విదిత‌మే.



10587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles