మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న చుల్ బుల్ పాండే

Tue,October 31, 2017 04:21 PM
dabangg come soon

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలలో చుల్ బుల్ పాండేగా ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్ ఆఫీసర్ గా విభిన్న పాత్రలో నటించిన సల్మాన్ దబాంగ్ సిరీస్ తో ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక త్వరలో దబాంగ్ 3 కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సల్మాన్ ధృవీకరించాడు. ప్రస్తుతం అతుల్ అగ్నిహోత్రి నిర్మించే భరత్ అనే సినిమాతో బిజీగా ఉన్న సల్మాన్ ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో దబాంగ్ 3 చేస్తాడట. అర్బాజ్ ఖాన్ నిర్మించే దబాంగ్ 3 చిత్రం స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ కాగా, త్వరలోనే మూవీని సెట్స్ పైకి తీసుకెళతారట. మొదటి రెండు భాగాలలో చుల్ బుల్ పాండే గతాన్ని చూపించిన టీం మూడో పార్ట్ లో ఆయన ప్రస్తుతం గురించి వివరిస్తారట.2010లో వచ్చిన దబాంగ్ చిత్రం తెలుగులో గబ్బర్ సింగ్ గా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఐదు సంవత్సరాల తర్వాత దబాంగ్ సిరీస్ లో నిర్మితం కానున్న దబాంగ్ 3 ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాలి.

1136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS