తెలుగు అభిమానుల‌తో స‌ల్మాన్ మాట ముచ్చ‌ట‌

Wed,October 23, 2019 11:00 AM

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం ద‌బాంగ్ 3. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా క‌థానాయిక‌గా న‌టించింది. చుల్‌బుల్ పాండేగా స‌ల్మాన్ అల‌రించ‌నున్నాడు. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ని నేటి సాయంత్రం 5గం.లకి విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులోను చిత్రం విడుద‌ల కానుండ‌డంతో తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్‌ని పీవీఆర్, ఆర్‌కే సీనీ ప్లెక్స్‌లో సాయంత్రం 5గం.ల‌కి ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఆ త‌ర్వాత స‌ల్మాన్ తెలుగు ఫ్యాన్స్‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడ‌నున్నార‌ట‌. న‌వంబ‌ర్‌లో సల్మాన్ హైద‌రాబాద్‌కి రానున్న‌ట్టు తెలుస్తుంది. చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌నున్నారు. స‌ల్మాన్ రాక కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ద‌బాంగ్ ఫ్రాంచైజీలో వ‌స్తున్న ద‌బాంగ్ చిత్రంలో సుదీప్ ప్ర‌తి నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు

1242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles