ప్ర‌ముఖ సినీ నిర్మాత క‌న్నుమూత‌

Sat,October 27, 2018 09:31 AM
D Shiva Prasad Reddy dies in chennai

ప్ర‌ముఖ నిర్మాత డి శివ‌ప్ర‌సాద్ రెడ్డి (62) ఈ రోజు ఉద‌యం 6.30 ని.ల‌కి చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్న‌మూశారు. కొన్నాళ్లుగా ఆయ‌న గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ ఉన్నారు. ఆయ‌న‌కి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం చెన్నైలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 1985లో కామాక్షి మూవీస్ అనే బేన‌ర్ స్థాపించి ప‌లు హిట్ సినిమాలు నిర్మించారు. కార్తీక పౌర్ణ‌మి, శ్రావ‌ణ సంధ్య ,విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటో డ్రైవ‌ర్, సీతారామ‌రాజు, ఎదురు లేని మ‌నిషి, నేనున్నాను, బాస్ , కింగ్‌, కేడి, రగ‌డ‌, ద‌డ‌, గ్రీకు వీరుడు అనే చిత్రాలు ఆయ‌న బేన‌ర్‌లో నిర్మిత‌మ‌య్యాయి. అక్కినేని నాగార్జున హీరోగా ఎక్కువ సినిమాలు నిర్మించారు శివ‌ప్ర‌సాద్ రెడ్డి. ఆయ‌న నిర్మాత‌గానే కాక ప‌లు చిత్రాల‌ని డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. శివ ప్రసాద్ మృతికి సంతాపంగా ఇటు తెలుగు, అటు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

3798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles