సైబ‌ర్ నేరాల‌పై సెల‌బ్రిటీల మెసేజ్‌

Tue,February 20, 2018 10:09 AM
Cyber crimes short films

టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ది చెందుతుండ‌టంతో మంచితో పాటు చెడు కూడా పెరిగిపోతుంది. కొంద‌రు నేర‌గాళ్ళు అమాయ‌కుల‌కి గాలం వేసి వారి ద‌గ్గ‌ర నుండి ల‌క్ష‌లు రాబ‌డుతున్నారు. సైబ‌ర్ పోలీసులు ఈ నేరాల‌కి అడ్డుక‌ట్ట వేసేందుకు ఎంత ప్ర‌య‌త్నించిన అది క‌ష్టంగా మారింది. ఇందుకోసం జ‌నాల‌లో అవ‌గాహ‌న క‌నిపించే ప్లాన్ చేసింది. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిఖిల్‌ల‌తో ల‌ఘు చిత్రం ద్వారా ప్ర‌చారం చేప‌ట్టింది హైద‌రాబాద్ పోలీస్ శాఖ‌. ఆన్‌లైన్ చాటింగ్‌, ఫోటోలు షేర్ చేయ‌డం వంటి విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఎన్టీఆర్ సందేశం ఇవ్వ‌గా, మ్యాట్రిమోని మోసాల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆన్‌లైన్ జాబ్‌ల పేరిట రాజ‌మౌళి, మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్ ఫ్రాడ్‌పై నిఖిల్ ప్ర‌జ‌ల‌కి సందేశం ఇచ్చారు. ప్రసాద్‌ ఫిల్మ్‌ లాబ్స్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వీవీ శ్రీనివాస రావు, అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(క్రైమ్‌ విభాగం) స్వాతి లక్రా, నిర్మాత దిల్‌ రాజు, నటి సుప్రియ తదితరులు పాల్గొన్నారు. త్వ‌ర‌లో ఈ వీడియోల‌ని థియేటర్లలోను ప్రదర్శించి జ‌నాల‌లో మ‌రింత అవగాహ‌న పెంచే ప్లాన్ చేస్తుంది హైద‌రాబాద్ పోలీస్ శాఖ‌.

1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS