ఐష్ ఫ్యామిలీ క్యూట్ పిక్‌

Wed,November 20, 2019 09:50 AM

అందాల తార ఐశ్వ‌ర్యరాయ్‌ నాలుగు ప‌దుల‌ వ‌య‌స్సులోను కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటుంది. న‌వంబ‌ర్ 1న ఐశ్వ‌ర్య‌రాయ్ 46వ వసంతంలోకి అడుగుపెట్టగా, ఆమెకి అభిమానులు, సినీ ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఇక న‌వంబ‌ర్ 16న ఐష్- అభిషేక్‌ల గారాల ప‌ట్టి ఆరాధ్య 8వ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజు చిన్నారి బ‌ర్త్‌డే గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సోనాలి బింద్రే, రితేష్ దేశ్‌ముఖ్, క‌రణ్ జోహార్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఆరాధ్య బ‌ర్త్‌డే ఫోటోల‌తో పాటు ఐష్ ఫ్యామిలీ పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎర్ర‌ని ఎంబ్రాయిడ‌రీ లెహంగాలో ఐష్ మెర‌వ‌గా, అభిషేక్ బ్లాక్‌, గోల్డ్ ప్రింటెడ్ షెర్వా ధ‌రించాడు. ఇక ఆరాధ్య కూడా స్టైలిష్ డ్రెస్‌లో మెరిసింది. వీరి ముగ్గురి ఫోటో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంది. అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్‌లు కుచ్ న క‌హో అనే చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఏప్రిల్ 20, 2017లో వీరి వివాహం ముంబైలో ఘ‌నంగా జ‌రిగింది. 2011 న‌వంబ‌ర్‌లో వీరికి ఆరాధ్య అనే చిన్నారి జ‌న్మించిన విష‌యం విదిత‌మే.





3013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles