హావ‌భావాల‌తో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న అనుప‌మ‌

Tue,October 9, 2018 11:19 AM
Cute Dubsmash Video Of Anupama Parameswaran On 96 Movie Song

మ‌ల‌యాళీ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌ట‌నా నైపుణ్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రేమ‌మ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యమైన ఈ అమ్మ‌డు వైవిధ్య‌మైన చిత్రాల‌లో న‌టించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. ఆమె తాజా చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే అక్టోబ‌ర్ 18న ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల కానుంది. అయితే వెండితెర‌పైనే కాకుండా సోష‌ల్ మీడియాకి సంబంధించిన ఆప్స్‌తోను హృద‌యాల‌ని గెలుచుకుంటున్న అనుప‌మ తాజాగా విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన 96 చిత్రంలోనికాథ‌లే కాథ‌లే సాంగ్‌కి డ‌బ్‌స్మాష్ చేసింది. చిన్న బిట్‌లో అనుప‌మ ఇచ్చిన ప‌లు ఎక్స్‌ప్రెష‌న్స్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. 96 చిత్రానికి అఫీషియ‌ల్ మ్యూజిక్ పార్ట్న‌ర్ అయిన థింక్ మ్యూజిక్ సంస్థ ఈ వీడియోని త‌మ ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా ఇది వైర‌ల్ అయింది. గ‌తంలోను అనుప‌మ‌ ప‌లు సినిమాల‌కి సంబంధించిన సాంగ్స్‌కి డ‌బ్ స్మాష్ చేసి అంద‌రి హృద‌యాల‌ని గెలుచుకుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన త‌మిళ చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల అయింది. 96 చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేయనుండ‌గా ఇందులో స‌మంత‌, నాని ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని తెలుస్తుంది.


4218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles