పాక్ మాజీ క్రికెటర్ తో తమన్నా పెళ్ళి ?

Tue,September 5, 2017 10:50 AM
Cricketer Abdul Razzaq marries Tamannaah

మిల్కీ బ్యూటీ తమన్నా పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ని పెళ్ళాడబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సడెన్ గా ఇలాంటి రూమర్ ఎలా పుట్టుకొచ్చిందని అందరు ఆలోచనలు చేస్తున్నారు. మేట‌ర్‌లోకి వెళితే త‌మ‌న్నా, అబ్ధుల్ రజాక్ ఇద్దరు కలిసి నగల‌ దుకాణంలో కలిసి ఉన్న ఫోటో నెటిజన్ల కంట పడింది. ఇక అంతే తన ప్రియుడితో కలిసి పెళ్ళి షాపింగ్ చేస్తుందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే ఈ ఫోటో 2013 సంవత్సరంది కాగా, అప్పట్లో దుబాయ్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కి తమన్నా, రజాక్ వెళ్ళారు. అప్పుడు క్లిక్ చేసిందే ఈ ఫోటో. ఇప్పుడు ఈ పిక్ ని వైరల్ గా మార్చి తమన్నా పెళ్లి పీటలెక్కనుందని రూమర్స్ పుట్టించారు. బాహుబలి సినిమాలో అవంతికగా నటించి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తమన్నా పెళ్లి వార్త కొద్ది రోజులగా హాట్ టాపిక్ గా మారడంతో ఇటు సౌత్ , అటు నార్త్ అభిమానులు షాక్ అయ్యారు. తమన్నా గతంలో ఓ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాగా, నా జీవితంలోకి ఎవరైన అడుగు పెడితే నేనే మొదట మీ అందరికి చెబుతాను అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న తమ్మూ, జై లవకుశ లో ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం.

12481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS