అభిమాని ప్ర‌వ‌ర్త‌న‌తో షాకైన ప్ర‌భాస్

Tue,March 5, 2019 01:35 PM
Crazy Prabhas fan slaps him after taking photo

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన న‌టుడు ప్ర‌భాస్‌. ఈయ‌న‌కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా వారి హృద‌యాలు దోచుకునే ప్ర‌భాస్ పేరు వింటేనే వారు ప‌ర‌వ‌శించిపోతారు. అలాంటిది స్వ‌యంగా ఎదురుగా క‌నిపిస్తే ఆనందం అవ‌ధులు దాట‌డం ఖాయం. ప్ర‌స్తుతం సాహో చిత్రంతో పాటు రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌తో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్‌. అయితే సాహో చిత్రీక‌ర‌ణ కోసం ఇటీవ‌ల‌ లాస్ ఏంజెల్స్ వెళ్ళారు ప్ర‌భాస్‌. అక్క‌డ ఎయిర్ పోర్ట్‌లో ప్ర‌భాస్‌ని చూసిన ఫ్యాన్స్ ఆయ‌న‌తో ఫోటో దిగేందుకు ప‌రుగులు తీసారు. ఓ అమ్మాయి ప్ర‌భాస్‌తో ఫోటో దిగిన వెంట‌నే ఎగిరి గంతులు వేస్తూ ప్ర‌భాస్ చెంపని త‌డిమింది. దీంతో ఒక్క‌సారి షాక్ అయ్యారు ప్ర‌భాస్‌. మిగ‌తా అభిమానులతోను ప్ర‌భాస్ ఫోటోలు దిగి వారిని ఆనంద‌ప‌ర‌చారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న‌ సాహో చిత్రంకి సంబంధించి ఇటీవ‌ల ఓ వీడియో విడుద‌ల కాగా, ఇందులో ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ లుక్స్ అభిమానుల‌ని ఆక‌ట్టుకున్నాయి. మార్చి 3న విడుద‌లైన ఈ వీడియో సోష‌ల్ మీడియోని షేక్ చేసింది.

3819
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles