న‌వంబ‌ర్‌లో ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్న నాగ్..!

Tue,October 22, 2019 08:44 AM

సీనియ‌ర్ హీరో నాగార్జున చివ‌రిగా మ‌న్మ‌థుడు 2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచ‌న‌లు చేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు తీస్తాడ‌ని ప్రచారం జ‌రుగ‌గా, ఇటీవ‌ల బాలీవుడ్ చిత్ర రీమేక్ చేయ‌బోతున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. 2018లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఇలియానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌చ్చిన రైడ్ చిత్రాన్ని నాగ్ రీమేక్ చేయ‌డం ఖాయం అని ప్ర‌చారం చేశారు. అయితే ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 3కి హోస్ట్‌గా ఉన్న నాగ్ న‌వంబ‌ర్ త‌న బాధ్య‌త‌ల‌ని పూర్తి చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత త‌న తాజా చిత్రంపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడ‌ట‌. రైడ్ చిత్రం రీమేక్ చేయ‌డని, బంగార్రాజు మూవీనే సెట్స్ పైకి తీసుకెళతాడ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. బంగార్రాజు చిత్రంలో నాగ చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ లీడ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు

1383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles