అభిమాని వికృత చ‌ర్య‌తో ఇబ్బంది ప‌డ్డ హీరో

Tue,February 26, 2019 10:42 AM
Crazy fan grabs Nawazuddin Siddiqui

ఒక్కోసారి అభిమానులు చూపే అతి ప్రేమ‌తో సెల‌బ్రిటీలు చాలా ఇబ్బందిప‌డుతుంటారు. గ‌తంలో ప‌లువురు హీరో, హీరోయిన్స్ ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ని చాలా ఎదుర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ అభిమానుల ఓవ‌రాక్ష‌న్‌తో విసిగిపోయాడు. వివ‌రాల‌లోకి వెళితే రాత్ అకేలీ హై అనే చిత్ర షూటింగ్ కోసం కాన్పూర్ వెళ్ళాడు న‌వాజుద్దీన్‌. అక్కడ కొంద‌రు అభిమానులు ఆయ‌న‌ని చుట్టుముట్ట‌గా ప‌లువురు అభిమానుల‌కి సెల్ఫీలు ఇచ్చాడు. అయితే మ‌రి కొంద‌రు త‌మ‌తో కూడా సెల్ఫీ దిగ‌మ‌ని వారిస్తుండ‌గా, అక్క‌డి నుండి మెల్ల‌గా జారుకునే ప్ర‌య‌త్నం చేశాడు సిద్ధిఖీ. కాని ఓ అభిమాని నవాజుద్దీన్‌ను వెనక్కు లాగేసి మరి.. సెల్ఫీ తీసుకోబోయాడు. వెంటనే సెక్యురిటీ అప్రమత్తమై ఆయన్ను ముందుకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఆ అభిమానుల‌కి చీవాట్లు పెడుతున్నారు నెటిజ‌న్స్‌. ఇలాంటి వికృత చేష్ట‌ల‌తో సెల‌బ్రిటీల‌ని ఇబ్బందికి గురి చేయ‌డం మంచిది కాద‌ని వారు వాపోతున్నారు.

View this post on Instagram

Crazy selfie fan #nawazudinsiddiqui #kanpur

A post shared by Viral Bhayani (@viralbhayani) on

2123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles