'మెర్సల్‌'కి షాకిచ్చిన కోర్టు

Sat,September 23, 2017 04:59 PM
'మెర్సల్‌'కి షాకిచ్చిన కోర్టు

విజయ్ త్రిపాత్రాభినయంలో అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం మెర్సల్. తాజాగా చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది లైకుల పరంగా ప్రపంచ రికార్డు సాధించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడిగా, మెజీషియన్‌గా,డాక్టర్‌గా విజయ్ ఈ చిత్రంలో కనిపిస్తాడనేసరకి అభిమానులు అనేక ఊహాగానాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి అనుకోని షాక్ తగిలింది. మెర్సల్ టైటిల్ నేను 2014లో రిజిస్టర్ చేసుకోగా, నిబంధనలకి విరుద్ధంగా తన టైటిల్‌ని వాడేస్తున్నారని ఓ వ్యక్తి చెన్నై కోర్టులో పిటీషన్ వేశాడు. ఈ ఫిర్యాదుని పరిశీలించిన కోర్టు అక్టోబర్ 3వరకు సినిమాని ప్రమోషన్స్ చేయోద్దంటూ ఆర్డర్ పాస్ చేసిందట. అంటే దాదాపు 10 రోజుల పాటు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయకూడదన్నమాట. ఇది సినిమాపై ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మెర్సల్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సమంత, నిత్యామీనన్, కాజల్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు.

929

More News

VIRAL NEWS