అజిత్ సినిమా టీజర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్

Wed,May 10, 2017 03:48 PM
Countdown To Vivegam Teaser

తమిళంలో రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులలో అజిత్ ఒకడు. తల అని ముద్దుగా పిలుచుకునే అభిమానులు ఆయన సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అజిత్ శివ దర్శకత్వంలో వివేగమ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఈ హీరో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే వివేగం చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా, టీజర్ ని మరి కొద్ది గంటలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రొడక్షన్ సంస్థ సత్య జ్యోతి యూ ట్యూబ్ లో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే పోస్టర్స్ లో పలు లుక్స్ లో కనిపించిన అజిత్ .. టీజర్ లో ఎలా కనిపిస్తాడు అని ఫ్యాన్స్ అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ లో వివేగం మూవీ రిలీజ్ కి యూనిట్ ప్లాన్ చేస్తుంది.

1514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles