మ‌హేష్ మూవీ ఫ‌స్ట్ లుక్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్‌

Sat,August 4, 2018 10:05 AM
count down start for mahesh 25 movie first look

భ‌ర‌త్ అనే నేను చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని‌దత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల డెహ్రాడూన్‌లో పూర్తయింది. మరి కొద్ది రోజుల్లో రెండో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లనుంది.

ఏప్రిల్‌5 ,2019న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ర‌వి అనే పాత్ర‌లో మ‌హేష్ క్లోజ్ ఫ్రెండ్‌గా న‌రేష్‌ క‌నిపించ‌నున్నాడ‌ట‌. ముగ్గురు విద్యార్థులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు. రాజ‌సం అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ప‌రిశీలిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండగా, మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఫ‌స్ట్ లుక్ కోసం ఈ రోజు నుండి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసింది. మ‌రి మ‌హేష్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

2167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles