భారీ ఖ‌ర్చుతో దీప్‌వీర్ ప్రేమ పెళ్ళి

Wed,November 14, 2018 08:46 AM
costly accomidation foe deepika ranveer mariage

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ దీపికా ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్‌ల పెళ్లి హంగామా మొద‌లైంది. ఇటలీలోని లేక్ కోమోలో నిన్న సంగీత్ వేడుక జ‌ర‌గ‌గా నేడు ద‌క్షిణ భార‌తీయ సంప్రదాయం ప్ర‌కారం వీరిరివురి వివాహం జ‌ర‌గ‌నుంది. రేపు సింధీ సంప్ర‌దాయంలో వివాహం చేసుకుంటారు. అయితే పెళ్ళి కోసం ఇప్ప‌టికే భారీ ఏర్పాట్లు చేయ‌గా, అతిథుల కోసం లేక్ కోమో తూర్పు ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్టును బుక్ చేశారు. మొత్తం 75 గ‌దులు బుక్ చేయ‌గా వీటికి 1.73 కోట్లు ఖర్చు అవుతుందట‌. ఒక్కో రూముకి సుమారు 35 వేల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ హోట‌ల్‌లో బార్లు , రెస్టారెంట్స్‌, స్మిమ్మింగ్ పూల్‌తో పాటు అధునాత‌న స‌దుపాయాల‌న్నీ ఉంటాయ‌ట‌.

ఇక రుచిక‌ర‌మైన వంట‌లు రెడీ చేసేందుకు స్విట్జ‌ర్లాండ్ నుండి చెఫ్‌లు పిలిపించారు. వారం రోజుల పాటు దీపిక‌, ప‌దుకొణేలు ఇక్క‌డే ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సినిమాలో మాదిరిగానే అత్యంత వైభవంగా వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. అత్యంత ఖరీదైన విల్లా డెల్‌ బాల్బినెల్లా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఫ్లోరెన్స్ నుండి ఫ్లవర్ డెకరేషన్ నిపుణుల్ని రప్పించి వారితో వేదిక‌ని అందంగా రెడీ చేయించారు. ల‌గ్జ‌రీ బోటులో దీప్ వీర్ జంట‌తో పాటు అతిధులు వివాహ వేదిక వ‌ద్ద‌కు చేరుకుంటార‌ట‌. భారీ ఖ‌ర్చుతో దీప్ వీర్ వివాహం జ‌రుగుతుండ‌గా, ఇది వారి జీవితంలో ఒక మధుర‌స్మృతిగా మిగిలిపోతుంద‌ని అంటున్నారు. ఈ పెళ్లికి సెల్ ఫోన్స్‌ని నిషేదించ‌గా, బ‌హుమ‌తులు కూడా తీసుకురావొద్ద‌ని వారు కోరారు. తమకు గిఫ్ట్‌లు ఇచ్చే బదులు ఆ మొత్తాన్ని తన ఎన్జీవో ద లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని దీపికా కోరిన‌ట్టు స‌మాచారం.

1884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles