మెగా అల్లుడిని వేధించిన వారిని ప‌ట్టుకున్న పోలీసులు..!

Fri,June 14, 2019 11:55 AM
Cops Caught The Culprits Who Targeted  kalyan

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ని టార్గెట్ చేస్తూ కొంద‌రు ఆక‌తాయిలు సోషల్ మీడియాలో వేధింపులకి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత మంది పనిగట్టుకుని ఆయన్ని టార్గెట్ చేశారు. అసభ్యకర కామెంట్లు పెట్టారు. ఈ కామెంట్లను భరించలేక ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసే ఫొటోల కింద ఓ 10 మంది వ్యక్తులు దారుణమైన కామెంట్లు చేస్తున్నారని.. తన కుటుంబసభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కళ్యాణ్ దేవ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ 10 మందిని ప‌ట్టుకున్నారు. ఆ కుర్రాళ్ళ‌పై ఐటీ యాక్ట్‌లోని సెక్ష‌న్ 67 కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు తాజా స‌మాచారం. ఐపీ అడ్రెస్‌ల ద్వారా ఇన్‌స్టాగ్రామ్ యాజ‌మాన్యం సైబర్ నేర‌గాళ్ళ‌ని గుర్తించి, వారి వివ‌రాల‌ని పోలీసుల‌కి అంద‌జేసిన‌ట్టు తెలుస్తుంది.

4316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles