కారులో ఆ ఐదుగురు.. చివ‌రికి మిగిలేదెవ‌రు ?

Fri,September 7, 2018 09:06 AM
contestants fighting for task to finale task

ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా టాలీవుడ్ మార‌థాన్ అనే టాస్క్‌లో ఇంటి స‌భ్యులు అంద‌రు హుషారెత్తించేలా డ్యాన్స్ చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించారు. గురువారం ఎపిసోడ్‌తో ఈ టాస్క్‌కి ఎండ్ కార్డ్ ప‌డింది. ఇక డ్రా యువ‌ర్ బిగ్ బాస్ అనే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఆయ‌న ఎలా ఉంటాడో ఇంటి స‌భ్యులు ఊహించి బొమ్మ గీయాల‌ని చెప్పారు. అంతేకాదు బొమ్మ గీసేట‌ప్పుడు ఏం ఊహించుకొని గీసారో కూడా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరాడు . దీంతో ఇంటి స‌భ్యులు అంద‌రు స్టోర్ రూంలో ఉన్న వ‌స్తువుల‌ని తెచ్చుకొని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేశారు. ప‌నిలో ప‌నిగా ఆయ‌న‌ని ఆకాశానికి ఎత్తేశారు.

ఇక శ్యామ‌ల‌, గీతా మాధురిలు మార్నింగ్ టైంలో ఒకే బెడ్ పై ప‌డుకొని క‌ళ్లు మూసుకొని పాట‌లు పాడుతుంటారు. ఇది గ‌మ‌నించిన కౌశ‌ల్‌.. మీరు మంచిగా ప‌డుకొని వ‌చ్చారు అని చెబుతాడు. కుక్క‌లు మొర‌గ‌లేదు అంటే మేం ప‌డుకోలేద‌నే క‌దా అని గీతా వివ‌ర‌ణ ఇచ్చుకోగా, నేను నా వ‌ర్షెన్ చెబుతున్నాను అంటూ కౌశ‌ల్ అంటాడు. ఈ విష‌యంలో మీరు అన‌వ‌స‌రంగా గెలుక్కుంటున్నారు అని కౌశ‌ల్‌పై మండిప‌డుతుంది గీతా . కారణం లేకుండా గొడవ పెట్టుకొని ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేయాలనేదే మీ గేమ్ ప్లాన్.. మీతో నేను పడలేకపోతున్నా.. నన్ను ఎలిమినేషన్‌కు నామినేట్ చేసేయండి అంటూ ఫైర్ అయ్యింది గీతా మాధురి. ఇక తనీష్, దీప్తిలు ఎప్పటిలాగే గీతకు వంత పాడటంతో మరోసారి టార్గెట్ అయ్యాడు కౌశల్.

కొద్ది సేప‌ట్లో సైర‌న్ మోగ‌బోతుంద‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో అంద‌రు గార్డెన్ ఏరియాలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. కాని అంద‌రిని లివింగ్ రూంలో కూర్చోమ‌ని బిగ్ బాస్ చెబుతారు. ‘టిక్కెట్ టు ఫినాలే’లో భాగంగా.. గార్డెన్ ఏరియాలో ఒక కారు ఉంచి.. ఆ కారులో ముందుగా వెళ్లి కూర్చున్న‌ ఐదుగురు కంటెస్టెంట్స్ 24 గంటలు పాటు అందులోనే ఉండాలి. అంతేకాదు ఆ కారు నుండి కాలు కింద పెట్టకుండా కూర్చోవాలి. ఫైనల్‌గా ఆ ఐదుగురిలో ఎవరైతే కిందకి దిగకుండా ఉంటారో వాళ్ళకు ‘టిక్కెట్ టు ఫినాలే’ లభిస్తుందని.. ఈ టిక్కెట్‌ లభించిన వాళ్లకి ఎలిమినేషన్‌ నుండి మినహాయింపు కల్పిస్తూ.. ఫినాలేకి వెళ్లే అవకాశం కల్పించారు బిగ్ బాస్‌. అయితే నిర్ణీత సమయానికి ఒకరు కంటే ఎక్కువ మంది ఆ కారులో ఉంటే ఎవరికీ ‘టిక్కెట్ టు ఫినాలే’ లభించదంటూ మెలిక పెట్టారు బిగ్ బాస్.

సీజ‌న్ మొత్తం ఎలిమినేష‌న్ అయిన కార‌ణంగా కౌశ‌ల్ ఈ టాస్క్‌లో పాల్గొనే అవకాశం ఉండ‌ద‌ని చెప్పిన బిగ్ బాస్‌, సంచాల‌కుడిగా ఉండే ఛాన్స్ ఇచ్చారు. రోల్ మైక్ కారుకి త‌గ‌ల‌డంతో అత‌నిని ఔట్ అయిన‌ట్టు తెలిపాడు కౌశ‌ల్‌. ఇక సైర‌న్ మోగ‌గానే త‌నీష్‌, దీప్తి, గీతా, సామ్రాట్ , శ్యామ‌ల కారులోకి వెళ్లి కూర్చున్నారు. అమిత్ బ‌య‌ట‌నే ఉండిపోయాడు. దీంతో ఈ ఐదుగురి మధ్య ‘టిక్కెట్ టు ఫినాలే’ జరుగుతుంది.

సంచాల‌కుడిగా ఉన్న కౌశ‌ల్ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడు. అమిత్ బ‌య‌ట ఉండే కారులోప‌లి వారితో మాట్లాడుతుండ‌గా, కారుకి టచ్ కాకుండా మాట్లాడు అంటూ రూల్స్ పెట్టాడు. ఇక కారులో ఉన్న వారికి కావ‌ల‌సిన తినుబండారాలు అమిత్‌, రోల్‌లు అందించారు. ఫుడ్ త‌ప్ప మిగ‌తా ఏవి కారులో ఉన్న వారికి ఇవ్వ‌కూడ‌ద‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో ఈ గేమ్ ఆస‌క్తిక‌రంగా మారింది. మరి నేటి ఎపిసోడ్‌లో ఎవరు చివ‌రి వ‌ర‌కు నిలుస్తారో తెలియ‌నుంది.

6906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles