శ్రీముఖికి క్షమాప‌ణ‌లు చెప్పిన రాహుల్

Sun,October 27, 2019 07:59 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 స‌క్సెస్ ఫుల్‌గా 98 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు. ఐదుగురు కంటెస్టెంట్స్ వ‌చ్చే వారం ఫినాలే రేసులో పాల్గొన‌నున్నారు. ఇప్ప‌టికే టిక్కెట్ టూ ఫినాలేకి రాహుల్‌, బాబా భాస్క‌ర్ వెళ్ల‌గా మ‌రో ముగ్గురు ఎవ‌ర‌న్న‌ది నేడు తేల‌నుంది. అయితే శ‌నివారం ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యుల‌కి ‘సంధించు.. సాధించు’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్‌. ఈ టాస్క్ ప్రకారం బాణం, విల్లు సాయంతో బోర్డ్‌పై ఉన్న బెలూన్స్‌ని పగలగొట్టాలి. ప‌గిలిన బెలూన్‌లో ల‌గ్జ‌రీ ఐటెమ్ ఉండ‌గా, ఆ లగ్జరీ ఐటమ్ ఇంటి సభ్యల సొంతం అవుతుందని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.


టాస్క్‌లో మూడు జ‌ట్ల‌గా రంగంలోకి దిగారు ఇంటి స‌భ్యులు. రాహుల్‌, అలీ ఓ జ‌ట్టుగా జ‌త క‌ట్ట‌గా, వ‌రుణ్ సందేశ్, బాబా భాస్కర్ ఓ జ‌ట్టు.. శ్రీముఖి, శివ‌జ్యోతి ఓ జ‌ట్టు. ముందుగా రాహుల్ గురి చూసి బాణం విస‌ర‌గా ఒక్క బెలూన్ ప‌గ‌ల‌లేదు. బాబా భాస్కర్ సైతం ఒక్క బెలూన్‌కి కూడా కొట్టలేకపోయారు. శ్రీముఖి గురి మాత్రం తప్పలేదు.. గురి చూసి బెలూన్‌ని పగలగొట్టింది. అలీ, శివజ్యోతిలు కూడా గురి చూసి బెలూన్స్ కొట్టడంలో సక్సెస్ అయ్యి లగ్జరీ బడ్జెట్‌ను సాధించారు. చివర్లో వరుణ్ సందేశ్ బాణాన్ని సంధించడంలో విఫలమై లగ్జరీ బడ్జెట్‌ను సాధించలేకపోయారు.

అనంతరం కళ్లకు గంతలు కట్టుకుని బౌల్స్‌లో బాల్స్ వేయాలనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో బాబా భాస్కర్ మాత్రమే కళ్లకు గంతలు కట్టుకుని బాల్ వేయగలిగారు. దీంతో బాబా ఈ టాస్క్‌లో విజేతగా నిలిచారు. ఇక ఆ త‌ర్వాత నాగార్జున ఇంటి స‌భ్యుల‌ని మన టీవీలో ప‌ల‌కరించాడు. రాహుల్.. టికెట్ టు ఫినాలే గెలుచుకోవ‌డంతో ఆయ‌న‌ని అభినందించారు. ఆ త‌ర్వాత ఓ వీడియో చూపించి రాహుల్ వాద‌న త‌ప్ప‌ని తేల్చారు నాగ్‌.

గ‌త ఎపిసోడ్‌లో రాహుల్‌.. శ్రీముఖిపై ప‌లు ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ని బిగ్ బాస్‌కి రిక‌మెండ్ చేసింది శ్రీముఖి అని, ఈ విష‌యం వితికాతో చెప్పింద‌ని రాహుల్ అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్లే చేసి చూపించి అది త‌ప్ప‌ని తేల్చారు నాగ్‌. ఇందుకు శ్రీముఖికి క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాల‌ని నాగ్ ఆదేశించ‌గా, రాహుల్ శ్రీముఖికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అనంతరం శ్రీముఖి.. రాహుల్‌ని ఉద్దేశించి అతనే విన్నర్ అంటూ బాబా, శివజ్యోతిలో చర్చించిన వీడియోను ప్లే చేసి షాక్ ఇచ్చారు.

ఫేక్ ఎలిమినేష‌న్ త‌ర్వాత రాహుల్ బిగ్ బాస్ విన్న‌ర్ అని , ఈ విష‌యం నిర్వాహ‌కులు అత‌నికి చెప్పార‌ట‌. ఈ విష‌యం నాకు శివ‌జ్యోతి చెప్పింద‌ని శ్రీముఖి అలీతో చ‌ర్చించింది. దీనిపై శ్రీముఖికి చిన్న క్లాస్ పీకారు నాగార్జున‌. బిగ్ బాస్ విన్న‌ర్ కావ‌డం మా ఎవ‌రి చేతిలో ఉండ‌దు. కేవ‌లం ప్రేక్ష‌కుల ఓటింగ్ మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. ద‌య చేసి ఇలాంటి లేనిపోని అపోహ‌లు క‌లిగొంచొద్ద‌ని కోరాడు నాగ్‌. ఆ త‌ర్వాత ఉన్న ఆరుగురు ఇంటి సభ్యుల్లో ఎవరు విన్నర్, ఎవరు లూజర్ అనుకుంటున్నారో చెప్పాలని వాళ్లతో ఇంట్రస్టింగ్ టాస్క్ ఆడించారు నాగార్జున. ఆ త‌ర్వాత నామినేష‌న్‌లో ఉన్న న‌లుగురిలో శ్రీముఖి సేఫ్ అయింద‌ని, ఆమె ఫినాలేకి చేరుకుంద‌ని నాగ్ తెలిపారు. ఇక నేడు బిగ్ బాస్ హౌజ్ నుండి అలీ, వ‌రుణ్‌, శివ‌జ్యోతిల‌లో ఒక‌రు ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌నుండ‌గా, ఆ వ్య‌క్తి ఎవ‌రో మ‌రి కొద్ది గంట‌ల‌లో తేల‌నుంది.

2078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles