కాంగ్రెస్ లోకి నటి ఊర్మిళ..ముంబై నార్త్ నుంచి పోటీ..?

Tue,March 26, 2019 09:46 PM
Congress set to contest Urmila Matondkar for Mumbai-North

ముంబై : ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు సినీ స్టార్లు వివిధ పార్టీల్లోకి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముంబై నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఊర్మిళను పోటీలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరూపమ్ మాట్లాడుతూ..ఊర్మిళతో సమావేశమయ్యాం. ముంబై నార్త్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమెను కోరాం. మా ప్రతిపాదనను ఊర్మిళ అంగీకరిస్తారని నమ్మకం ఉంది. ఆమె భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వసిస్తున్నాం. ఊర్మిళ కాంగ్రెస్ నుంచి గెలిస్తే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బీజేపీ తరపున గోపాల్ శెట్టి ముంబై నార్త్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపాల్ శెట్టికి గట్టి పోటీనిచ్చే వ్యక్తిని వెతికే పనిలో పడింది కాంగ్రెస్.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles