నాని ఇచ్చిన షాక్‌కి ఇంటి స‌భ్యులు షేక్..!

Sun,September 2, 2018 07:09 AM
common man eliminated from bigg boss

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 చివ‌రి అంకానికి చేరుకుంటుంది. ఇన్నాళ్ళు హౌజ్‌లో స‌ర‌దాగా గ‌డిపిన ఇంటి స‌భ్యులకి రానున్న రోజులు క‌త్తి మీద సాములాంటివే.ఎంతో జాగ్ర‌త్త‌గా గేమ్ ఆడితే త‌ప్ప హౌజ్‌లో ఉండే ప‌రిస్థితి లేదు. గ‌త 12 వారాలు ప్ర‌తి వారం ఒకొక్క‌రు మాత్ర‌మే బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ కాగా, ఇక ఇప్ప‌టి నుండి డ‌బుల్ ఎలిమినేష‌న్‌. ఈ విష‌యాన్ని బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న నాని శ‌నివారం ( ఎపిసోడ్ 84) లో తెలియ‌జేశారు. ఎప్ప‌టి లాగానే పిట్ట క‌థ‌తో షో మొద‌లు పెట్టిన నాని శుక్ర‌వారం ఇంట్లో ఏం జ‌రిగిందో చూపించారు.

శుక్రవారం రోజు ఇంటి స‌భ్యులకి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ . ఎవ‌రైతే త‌మ‌ని ప్రొటెక్ట్ చేస్తార‌ని అనిపిస్తుందో వారికి బిగ్ బాంబ్ ప్రొటెక్ష‌న్ కార్డ్ ఇచ్చి అందుకు గ‌ల కార‌ణం కూడా వివ‌రించాల‌ని అన్నారు. దీంతో ముందుగా త‌నీష్‌.. సామ్రాట్‌ని ఎంపిక చేసుకోగా, గ‌ణేష్‌.. దీప్తిని, కౌశ‌ల్ .. నూత‌న్ నాయుడుని, గీతా.. శ్యామ‌ల‌ని, రోల్ రైడా.. అమిత్‌ని, సామ్రాట్‌.. త‌నీష్‌ని, నూత‌న్‌.. కౌశ‌ల్‌ని, శ్యామ‌ల‌.. గీతాని, దీప్తి.. నూత‌న్‌ని, అమిత్‌.. రోల్ రైడాల‌ని ఎంపిక చేసుకొని రీజ‌న్ కూడా చెప్పారు. ఇక ఇంట్లో గీతా అలానే ప‌డుకున్న కార‌ణంగా కుక్క‌లు మొరిగాయి. వెంట‌నే గీతా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన కౌశ‌ల్‌.. మీరు బిగ్ బాస్ రూల్స్ అతిక్ర‌మించార‌ని చెప్పాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య కాస్త డిస్క‌ష‌న్ జ‌రిగింది.

ఇక ప్ర‌తీ వారం ఇంటి స‌భ్యులు చేసిన త‌ప్పుల‌ని స‌రి చేస్తూ వారికి సూచ‌న‌లు ఇచ్చిన నాని ఇప్ప‌టి నుండి అవేమి ఉండ‌వ‌ని అన్నారు. ఈ ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యులే.. ఒకరిపై ఒకరు వేసుకుంటున్న నిందల్ని కార్డుపై రాసి పంపమని సూచించాడు.దీంతో అంద‌రు బెడ్ రూంలోకి వెళ్లి కార్డ్‌పై త‌మ అలిగేష‌న్స్ ఏమైతే ఉన్నాయో అవి రాసి స్టోర్ రూంలో పెట్టారు. ఇక లివింగ్ ఏరియాలో ఉన్న బోనులోకి ఒక్కొక్క‌రిగా వ‌స్తుండ‌గా, వారిపై వ‌చ్చిన నింద‌ల‌ని నాని చ‌దివి వినిపించారు. దీనిపై వారు వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నారు. అయితే వివ‌ర‌ణ ఇచ్చే స‌మ‌యంలో ఎప్ప‌టి లానే దీప్తి సోది చెప్ప‌డంతో నాని ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్‌కి న‌వ్వుల పువ్వులు పూశాయి.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ టాస్క్‌లో నూత‌న్ సైకిల్ చైన్ స్ట్ర‌క్ అయిన మ‌ళ్లీ ఆడిస్తుండడంపై త‌నీష్ బిగ్ బాస్‌పై ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. కావాల‌నే బిగ్ బాస్ ఇలా ఆడిస్తున్నారా అంటూ మండిప‌డ్డాడు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నాని ఈ 80 రోజుల‌లో బిగ్ బాస్ ఏదో ఒక స‌మ‌యంలో ఎవ‌రో ఒక‌ ఇంటి స‌భ్యుడికి స‌పోర్ట్ ఇచ్చి ఉంటారు. అంతే త‌ప్ప ఒక్క‌రిని త‌క్కువ చూడ‌డం మ‌రొక‌రని ఎక్కువ చూడ‌డం జ‌ర‌గ‌ద‌ని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే టాస్క్‌లో గీతా గెలిచి కౌశ‌ల్‌ని సీజ‌న్ మొత్తం నామినేట్ చేయ‌డంతో బిగ్ బాసే కావాల‌ని ఇలాంటి గేమ్ ఆడిస్తున్నారంటూ ప‌లు వార్తలు చ‌క్క‌ర్లు కొట్టాయి. దీనిపై కూడా నాని వివ‌ర‌ణ ఇచ్చారు. అలాంటి దేమి లేదు, హంత‌కుడిని క‌నుక్కున్నాడు అనుకునే లోపే గ‌ణేష్‌, రోల్ రైడాలు త‌నీష్ వైపు మొగ్గు చూప‌డం మాకే షాకింగ్‌గా అనిపించింద‌ని అన్నాడు.

ఇక రోల్ రైడా పోలీస్ ఆఫీస‌ర్‌గా, గ‌ణేష్ డిటెక్టివ్‌గా ఫెయిల్ అయిన‌ట్టు నాని తెలియ‌జేశాడు. ఇక ప్ర‌తివారం కాల‌ర్‌తో మాట్లాడే ఛాన్స్ ఇంటి స‌భ్యునికి ఇస్తున్న నాని శ‌నివారం కూడా ఓ కాల‌ర్‌కి కాల్ క‌లిపారు. అత‌ను గ‌ల్లీ పోర‌డు రోల్ రైడాతో మాట్లాడి త‌న ఆనందాన్ని తెలియ‌జేశాడు. బిగ్ బాస్ సీజన్ 2 ఫైన‌ల్ స్టేజ్‌కి చేరుతున్న క్ర‌మంలో శ‌నివారం రోజు ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని చెప్పిన నాని నామినేట్ అయిన స‌భ్యుల‌లో కౌశ‌ల్ ప్రొటెక్టెడ్ జోన్‌లో ఉన్న‌ట్టు తెలియ‌జేశాడు. ఇక కామ‌న్ మ్యాన్ త‌ర‌పున ఇంట్లోకి వచ్చి దాదాపు 84 రోజులు బిగ్ బాస్ హౌజ్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్న గ‌ణేష్ ఈ వారం ఎలిమినేట్ అయిన‌ట్టుగా తెలియ‌జేశాడు నాని. గ‌త రెండు వారాలుగా అతని గేమ్ మరీ తీసికట్టుగా మారింది. ముఖ్యంగా.. గత వారం తన మైక్ బ్యాటరీలు తీసి మరీ.. బిగ్‌బాస్‌పై అక్కసు వెళ్లగక్కడం, టాస్క్‌ల్లో చురుకుదనం తగ్గిపోవడంతో అతను సూట్‌కేస్ సర్దుకోక తప్పలేదు.

ఇక ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో అమిత్‌, నూత‌న్ నాయుడు, సామ్రాట్‌లు ఉండ‌గా వీరిలో ఎవ‌రు ఇంటి నుండి వెళ్లిపోనున్నారో నేటి ఎపిసోడ్‌లో తెలియ‌నుంది. ఈ 80 రోజుల‌కి భిన్నంగా నిన్న‌టి నుండి బిగ్ బాస్ షో న‌డుస్తుండ‌గా, రానున్న రోజుల‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌నున్నాయో అంటూ బుల్లితెర ప్రేక్ష‌కులు ఆసక్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు.

8850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles