పార్టీలో క‌మెడీయ‌న్స్ చెడ్డీ గ్యాంగ్‌ ..

Tue,August 14, 2018 10:45 AM
comedians enjoyed in the theme party

కొన్నాళ్ళుగా హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాలలో చెడ్డీ గ్యాంగ్ సృష్టించిన భీభ‌త్సం అంతా ఇంతా కాదు. పోలీసుల‌కి చిక్క‌కుండా వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవ‌ల చెడ్డీ గ్యాంగ్‌కి సంబంధించిన కొంత‌మంది స‌భ్యులు పోలీసుల‌కి దొరికిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ క‌మెడీయ‌న్ చెడ్డీ గ్యాంగ్ ఏంటనే అనుమానం మీలోను ఉంది కదా..! మ‌రేం లేదండి వెన్నెల కిషోర్ నేతృత్వంలో 11 మంది క‌మెడీయ‌న్స్ క‌లిసి థీమ్ పార్టీ జ‌రుపుకున్నారు. ఇందుకు అంద‌రు తెల్ల‌ని చొక్కా, నీలం రంగు నిక్క‌రు, మెడకు టైతో హాజ‌రై అంద‌రిని ఆశ్చర్య‌ప‌ర‌చారు. ప్ర‌తీ నెలా టాలీవుడ్ క‌మెడీయ‌న్స్ ఇలా థీమ్ పార్టీ జ‌రుపుకుంటుండ‌గా, ఈ సారి మాత్రం అభిమానుల‌కి చిన్న క్లారిటీ ఇచ్చారు వెన్నెల కిషోర్. పార్టీలో ఏం చేస్తారో తెలియ‌దు కాని ఈ పార్టీకి మాత్రంఓ థీమ్ ఉంద‌ట‌. అదే బ్యాక్ టూ స్కూల్ . పార్టీలో వెన్నెల కిషోర్ తో పాటు నందు, శ్రీనివాసరెడ్డి, ధ‌న‌రాజ్, వేణు , స‌ప్త‌గిరి, స‌త్యం రాజేష్‌, ర‌ఘు త‌దిత‌రులు సందడి చేశారు.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS