హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

Mon,February 19, 2018 07:11 AM
Comedian Gundu Hanumantha Rao passed away

హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 3:30 గంటలకు ఎస్‌ఆర్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా ఆయన 400 సినిమాల్లో నటించారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నారు. 1956లో కాంతారావు, సరోజిని దంపతులకు హన్మంతరావు జన్మించారు. 1974లో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ.


మద్రాసులో ఆయన నాటకాన్ని చూసిన జంద్యాల అహనా పెళ్లంట సినిమాలో మొదటి వేషం ఇచ్చారు. అనంతరం వరసగా సినిమా అవకాశాలు రావడంతో 50 సినిమాలు నటించిన తరువాత తన నివాసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చారు. ఆయన భార్య ఝాన్సీరాణి(45) 2010లో మృతి చెందారు. సినిమాలకు ముందు హన్మంతరావు స్వీట్ షాపును నిర్వహించేవారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదన్నారు. దీంతో విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. హనుమంతరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

హన్మంతరావు నటించిన చిత్రాలు:...
చిన్నబాబు (1988)
హై హై నాయకా (1989)
ప్రేమ (1989)
కొబ్బరి బొండాం (1991)
బాబాయి హోటల్ (1992)
అల్లరి అల్లుడు (1993)
వద్దు బావా తప్పు (1993)
మాయలోడు (1993)
పేకాట పాపారావు (1993)
ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం (1993)
నంబర్ వన్ (1994)
శుభలగ్నం (1994)
యమలీల (1994)
వజ్రం (1995)
క్రిమినల్ (1995)
ఘటోత్కచుడు (1995)
రిక్షావోడు (1995)
వినోదం (1996)
మావిచిగురు (1996)
జగదేకవీరుడు (1996)
అన్నమయ్య (1997)
లవ్ స్టోరీ 1999 (1998)
యమజాతకుడు (1999)
సమరసింహారెడ్డి (1999)
కలిసుందాం రా (2000)
ఫ్యామిలీ సర్కస్ (2001)
భలేవాడివి బాసూ (2001)
మృగరాజు (2001)
తప్పు చేసి పప్పు కూడు (2002)
నువ్వు లేక నేను లేను (2002)
ఆయుధం (2003)
సత్యం (2003)
పెళ్ళాం ఊరెళితే (2003)
రక్షక్ (2004)
గౌతమ్ SSC (2005)
ధన 51 (2005)
అతడు (2005)
భద్ర (2005)
శ్రీ కృష్ణ 2006 (2006)
మాయాజాలం (2006)
ఆట (2007)
ఎవడైతే నాకేంటి (2007) -
పాండురంగడు (2008)
నగరం (2008)
కృష్ణార్జున (2008)
పెళ్ళికాని ప్రసాద్ (2008)
వాన (2008)
దీపావళి (208)
మస్కా (2009)
రాజ్ (2010)
ఆలస్యం అమృతం (2010)
పప్పు (2010)

7852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles