తెలంగాణ కోసమే కేసీఆర్ పుట్టాడు : బ్రహ్మానందం

Tue,December 19, 2017 05:23 PM
Comedian Brahmanandam praises on CM KCR

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై హాస్య నటుడు బ్రహ్మానందం ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ కోసమే కేసీఆర్ పుట్టాడని కొనియాడిన బ్రహ్మానందం.. కేసీఆర్ కారణ జన్ముడు అని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ఎల్బీ స్టేడియంలోని బమ్మెర పోతన వేదికపై ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి కార్యక్రమంలో బ్రహ్మానందం పాల్గొని ప్రసంగించారు. తెలుగు మహాసభల సందర్భంగా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణ పేరు, తెలంగాణ సాహిత్యం పేరు చెబితే పాల్కురికి సోమనాథుని బసవపురాణం గుర్తొస్తది అని తెలిపారు. బమ్మెర పోతన గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు కేసీఆర్ గొప్ప వరమన్నారు. కేసీఆర్ కారణ జన్ముడు. తొమ్మిది మంది సంతానం తర్వాత కేసీఆర్ ఎందుకు పుట్టారంటే.. తెలుగు మహాసభలను ఇంత గొప్పగా జరిపేందుకేనేమో అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అనిపించుకునే స్థితి కల్పించారు. కేసీఆర్ తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించుకుంటున్నారు. గురువు కాలు మొక్కిన సంస్కారవంతుడు కేసీఆర్ అని కొనియాడారు. యావత్ కుటుంబానికి కేసీఆర్ సంస్కారం నేర్పారు. కేటీఆర్, కవిత మంచి సంస్కారవంతులు అని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో ఇలాంటి సభలు నిర్వహించడం తెలుగు జాతి పరవశించిపోయే దినమని బ్రహ్మానందం పేర్కొన్నారు. సందర్భానుసారంగా బ్రహ్మానందం పద్యములు చదివి వినిపించారు.

2700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles