తమన్నాకి కోస్టార్స్ బర్త్ డే విషెస్

Wed,December 21, 2016 11:44 AM
co stars wish to tamannah

పాలవన్నె తెలుపుతో మెరిసిపోయే తారలు ఎక్కడో కాని తారసపడరు. నక్షత్రాల మధ్య చంద్రుడిలా వీరు ఎందరి మధ్యలో ఉన్నా ఇట్టే ఆకట్టుకుంటారు. అలాంటి పాలవన్నె సుందరి తమన్నా దాదాపు పదేళ్ల నుంచీ సినిమాల్లో సందడి చేస్తోంది. సినిమాలో కనిపించినా, బయట ఫంక్షన్స్ లో కనిపించినా అందరి అటెన్షన్ తమన్నా మీదే. ఎందరిలో ఉన్నా మిలమిల చందమామలా మెరిసిపోతుంది తమన్నా. కాబట్టే తమ్మూను మిల్కీ బ్యూటీ అన్నారు. నేడు తమన్నా బర్త్ డే.

హీరోయిన్ తమన్నాను చూడగానే కాశ్మీరీ యాపిల్ పండు గుర్తుకొస్తుంది. గ్లామరస్ హీరోయిన్ ఇలా ఉండాలి అని ఎవరైనా డిఫైన్ చేయాలనుకుంటే తమన్నాను చూసి చేయవచ్చు. ఈ పంజాబీ పిల్ల తెలుగులో చేసిన మొదటి సినిమా శ్రీ. అందులో హీరో మనోజ్ కుమార్. ఆ పిక్చర్ 2006లో వచ్చింది. ఈ సినిమా తమన్నాను కొంత డిసపాయింట్ కు గురిచేసింది. తమన్నాకు మొదటి బాలీవుడ్ చిత్రం హిమ్మత్ వాలా కూడా నిరాశనే మిగిల్చింది. అయినా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా స్టాండ్ అయింది.

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా సక్సెస్ అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. మూవీ ఎంట్రీకి మోడలింగ్ ఒక ఈజీ రూట్ గా మారింది. ఎందుకంటే అందచందాలు, సొగసులు సోయగాలు మొదట కనిపించేది, కనువిందు చేసేది అక్కడే. నాటి ఐశ్వర్యారాయ్ మొదలుకొని నేటి స్టార్ హీరోయిన్ లు మోడలింగ్ నుంచి వచ్చిన వాళ్లే. కానీ తమన్నా మాత్రం ప్లస్ 2 చేసి మూవీస్ లోకి వచ్చింది. మూవీస్ లో సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మోడలింగ్ చేస్తోంది.

తమన్నాకు తెలుగులో బాహుబలి మంచి పేరు తెచ్చింది. అందులో అవంతిక పాత్రలో తమ్మూ ఆడియన్స్ హార్ట్స్ కొట్టేసి, అల్లరి చేసింది. ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ బాహుబలి 2లో నటిస్తోంది. తమిళంలో రీమేక్ చేస్తున్న బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ లోనూ నటిస్తోంది. హిందీలో కంగనా రనౌత్ చేసిన కేరక్టర్ ను తమిళంలో తమన్నా పోషిస్తోంది. తమ్మూ నటించి కత్తి సాండై చిత్రం తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో ఈ శుక్రవారం విడుదల కానుంది. తమన్నా తన కెరియర్ లో మరిన్ని పిక్చర్స్ లో నటించాలని కోరుతూ అభిమానులు, కో స్టార్స్ , పలువురు ప్రముఖులు ఈ అమ్మడికి విషెస్ అందిస్తున్నారు.


2337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles