ఇండ‌స్ట్రీలో నాలుగు ద‌శాబ్ధాలు పూర్తి చేసుకున్న ఆలీ

Tue,February 19, 2019 08:33 AM
CM ATTENDS FOR senior comedian ali 40 years celebrations

1979లో ప్రెసిడెంట్ పేర‌మ్మ చిత్రంతో బాల‌న‌టుడిగా వెండి తెర‌కి ప‌రిచ‌య‌మైన ఆలీ కమెడీయ‌న్‌గా, హీరోగా, యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో సుస్థిర స్థానం ఏర్ప‌ర‌చుకున్నాడు. ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగు ద‌శాబ్ధాలు పూర్తి కావ‌డంతో ప్ర‌ముఖ సాంస్కృతిక సంస్థ సంగ‌మం ఆయ‌న‌ని ఈ నెల 23న ఘ‌నంగా స‌న్మానించాల‌ని భావించింది. విజ‌య‌వాడ‌లోని శ్రీ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం ఆడిటోరియంలో ఈ స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుండ‌గా ముఖ్య అతిధిగా నారా చంద్ర‌బాబు నాయుడు హాజరు కానున్నారు. ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సినీరంగ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ‘ఆలీ నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం’ అనే పేరుతో జ‌ర‌గ‌నున్న కార్యక్రమంలో ఆలీకి స్వర్ణకంకణం తొడిగి ఘనంగా సత్కరించనున్నామని సంజ‌య్ కిషోర్ వెల్ల‌డించారు. 1981లో విడుదలైన ‘సీతాకోకచిలుక’ చిత్రానికి ఆలీ బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు . ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల‌లో కమెడీయ‌న్‌గా న‌టించిన ఆలీ 1994లో వచ్చిన ‘యమలీల’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

1423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles