'3.0'పై శంక‌ర్ క్లారిటీ

Thu,December 6, 2018 08:36 AM
clarity comes on 3.0

ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్ 2010లో వ‌చ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 అనే చిత్రం తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. అయితే చిత్రం చివ‌రలో చిట్టి స్థానంలో కుట్టి (తెలుగులో చిన్ని) అనే సూపర్ హ్యూమనాయిడ్ రోబో ఉంటుందని హింటిస్తూ 2.0 సినిమాను ముగించడంతో అభిమానులు ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు క‌థ‌లు అల్లేసుకుంటున్నారు. 3.0 చిత్రం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌ప్ప‌క రానుంద‌ని అన్నారు. దీనిపై శంక‌ర్ క్లారిటీ ఇచ్చాడు.

2.0 సీక్వెల్‌పై ఆంగ్ల‌ప‌త్రికతో మాట్లాడిన శంక‌ర్ .. ఏదో తీయాల‌ని సీక్వెల్ తీయ‌ము. ఒక్కోసారి అలా జ‌రిగిపోతుంటాయి. స‌రైన క‌థ దొరికితేనే సీక్వెల్ చేస్తాను. చేయాలి క‌దా అని ఎప్పుడు చేయ‌ను. ‘నా సినిమాలు ఓపెన్‌ ఎండింగ్‌గా ఉంటాయి.. తర్వాతి భాగానికి తారాగణం కూడా అందుబాటులోనే ఉంటుంది. స‌రైన స్క్రిప్టు నాకు దొరికితే.. అదే సినిమా రూపం దాల్చుకుంటుంది. ఆ స్క్రిప్టు న్యూ టెక్నాలజీని డిమాండ్‌ చేస్తే.. దాని ప్రకారమే జరుగుతుంది’ అని శంకర్‌ పేర్కొన్నారు. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 2.0 చిత్రంలో ర‌జ‌నీకాంత్‌, అమీజాక్స‌న్‌, అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే.

4569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles