సినీ పరిశ్రమకు మరో విషాదం.. గుండెపోటుతో మరణించిన సీకె విశ్వనాధ్

Tue,December 22, 2015 03:31 PM
ck vishwanath dead due to heart attack

గత వారం రోజుల నుండి సినీ పరిశ్రమ చావు వార్తలతో షాక్‌కు గురవుతోంది. మొన్నటికి మొన్న దేవిశ్రీ ఫాదర్ చనిపోగా, వెంటనే అనూప్ మదర్ చనిపోయారు. ఆ తర్వాత చాట్ల శ్రీరాములు, కొన్నిరోజులకే రంగనాథ్ మరణించారు. ఇక ఆ విషాద వార్తలనుండి కోలుకునే లోపే ప్రముఖ కొరియో గ్రాఫర్ భరత్ ఆత్యహత్య చేసుకున్నారన్న వార్త అభిమానులకు పెద్ద షాకింగ్‌గా మారింది . ఇక తాజాగా ప్రముఖ నటుడు, రచయిత చిలుకోటి కాశీ విశ్వనాధ్ మరణ వార్త సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది.

చిలుకోటి కాశీ విశ్వనాథ్ దాసరినారాయణ రావు, రేలంగి నరసింహరావు, రాజా చంద్ర, విజయ బాపినీడు వంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసారు. నటుడిగా రచయితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కాశీ విశ్వనాధ్ లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వైజాగ్ వెళ్తుండగా ఆయనకు ఖమ్మం సమీపంకు రాగానే గుండెపోటు వచ్చింది. దాంతో వెంటనే ఈయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికు ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఈయన గత కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

దాదాపు 70 సినిమాలకు రచయితగా చేసిన చిలుకోటి కాశీ విశ్వనాధ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు కాగా ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

4406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS