పద్మావత్‌కు వ్యతిరేకంగా థియేటర్ ధ్వంసం!

Thu,January 18, 2018 05:26 PM
Cinema Hall vandalized by karni Sena in Bihar in protest of Padmaavat

పాట్నాః సాక్షాత్తూ సుప్రీంకోర్టే పద్మావత్ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. రాజ్‌పుత్ కర్ణిసేన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సినిమాకు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నది. సినిమా రిలీజ్ చేసే థియేటర్లను తగులబెడతామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ సినిమా థియేటర్‌ను కర్ణిసేన సభ్యులు ధ్వంసం చేశారు. సినిమాను బ‌హిష్క‌రించండి.. దేశవ్యాప్తంగా ప్రజలు థియేటర్లకు వెళ్లకూడదు అని కర్ణిసేన నేత లోకేంద్ర సింగ్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. మరోవైపు పద్మావత్ మూవీపై రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీపై నిషేధం విధించే హక్కు ఏ రాష్ర్టానికీ లేదని కోర్టు స్పష్టంచేసింది. ఓవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు కర్ణిసేన విధ్వంసంతో ఇప్పుడు రాష్ర్టాలు ఈ మూవీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాయి.


1156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS